యానిమల్ సినిమాలో ఈ సీన్ డిలీట్.. ఉండుంటే వేరే లెవల్ అంతే!

యానిమల్ సినిమాలో ఈ సీన్ డిలీట్.. ఉండుంటే వేరే లెవల్ అంతే!

ప్రస్తుతం ఇండియా మొత్తం యానిమల్(Animal) ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. చెప్పుకోవడానికి ఫాథర్ అండ్ సన్ ఎమోషనల్ కంటెంట్ అయినా.. దాన్ని సందీప్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మరీ  ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ ఉన్నాయని, ఒక్కో సీన్ ఒక్కో షాట్ గూస్బంప్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు.

ఎంతలా అంటే యానిమల్ సినిమా రన్ టైం 3:20 ఉన్నప్పటికి.. ఒక్క ఫ్రేమ్ కూడా మిస్ అవకుండా సీట్లకు అతుక్కుపోయి మరీ చేస్తున్నారు. అంతలా ఆడియన్స్ ను తన టేకింగ్ తో తనవైపుకు తిప్పుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇదిలా ఉంటే.. తాజాగా యానిమల్ సినిమాలో అదిరిపోయే సీన్ ఒకటి మిస్ అయ్యింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సీన్ కూడా ఉండి ఉంటే సినిమా మరో లెవల్లో ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. మేకర్స్ రిలీజ్ చేసిన యానిమల్ రిలీజ్ ట్రైలర్‌లో రణబీర్‌ ప్రైవేట్‌ చాటెడ్‌ ఫ్లైట్‌లో తన గ్యాంగ్ తో కలిసి ఉంటాడు. నల్లటి బట్టలు, ఒళ్లంతా గాయాలతో చాలా వైల్డ్ గా కనిపిస్తాడు. చేతిలో మందు గ్లాస్ పట్టుకొని కాక్‌పీట్‌ దగ్గరకు వచ్చి పైలెట్‌ ను పక్కకు జరిపి తానే ఫ్లైట్ నడుపుతాడు. ట్రైలర్ లో ఈ సీన్‌ అద్బుతంగా అనిపించింది. కానీ.. ఈ సీన్ కు సెన్సార్‌ వాళ్ళు అభ్యంతరం తెలిపారట. దీంతో.. సినిమాలో ఆ సీన్ ను తొలగించింది టీమ్. అయితే.. డిలీట్‌ అయిన ఆ సీన్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజనన్స్, సినిమా చూసిన ఆడియన్స్ ఈ సీన్‌ థియేటర్లలో ఉండి ఉంటే అరాచకంగా ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ సీన్ డిలీట్ చేయడంపై మీ స్పందన ఏంటో కామెంట్స్ చేయండి.