మెడికల్ రికార్డ్స్ తొలగిస్తున్నాం

మెడికల్ రికార్డ్స్ తొలగిస్తున్నాం
  •     అవసరమైన రోగులు నిమ్స్ లో సంప్రదించాలి 

పంజాగుట్ట,వెలుగు: నిమ్స్​ఆస్పత్రిలో రోగులకు సంబంధించిన మెడికల్ ​రికార్డ్స్​ పైల్స్‌‌‌‌‌‌‌‌ ​కావాలనుకునేవారు అప్లై చేసుకోవాలని నిమ్స్ ​మేనేజ్ మెంట్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. మెడికల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా రూల్స్ మేరకు పేరుకుపోయిన ఫైల్స్​ను పదేండ్లకోసారి నిర్వీర్యం చేస్తామని పేర్కొంది.  2011 జనవరి1 వరకు ఉన్న రికార్డ్స్​ను పూర్తిగా తొలగించేందుకు కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రోగుల రికార్డులు, కేస్‌‌‌‌‌‌‌‌షీట్​లు అవసరమైతే ​సూపరింటెండెంట్ ను  సంప్రదించాలని పేర్కొన్నారు.