ఆంధ్రప్రదేశ్ చేపట్టిన నల్లమల సాగర్ కు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టులో దీనిపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. గోదావరి జలాల్లో చుక్క నీరు కూడా వదులుకునేది లేదని అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం (జనవరి 16) నిర్మల్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మంత్రి.. తుమ్మిడిహట్టి నుంచి గ్రావీటి ద్వారా సుందిళ్ల ప్రాజెక్టుకు తరలిస్తామని చెప్పారు. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తామని తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో చెనాక కోరాట బ్యారేజి కోసం మరో వంద కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు- మంత్రి ఉత్తమ్. చెనాక కోరాట బ్యారేజికి మాజీ మంత్రి రామచంద్రా రెడ్డి పేరు , సదర్ మఠ్కు పి.నర్సారెడ్టి పేర్లు పెడుతున్నట్లు చెప్పారు. పీపీ ప్రాజెక్టు, మత్తడి, కుప్టి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 27 ప్యాకేజీలకు రూ.97 కోట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
