వరంగల్ జిల్లాలో భారీ కుంభకోణం జరిగింది. ధరణి, భూభారతి రిజస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన 15 మంది నిందితుల అరెస్టు చేశారు పోలీసులు. మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నారు. మొత్తం మూడు కోట్ల 72 లక్షల రూపాయల కుంభకోణం జరిగినట్టు శుక్రవారం (జనవరి 16) పోలీసులు వెల్లడించారు.
నిందితుల నుంచి 63 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లో ఉన్న లక్ష రూపాయలు ప్రీజ్ చేశారు. అదేవిధంగా కోటి రూపాయల విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, 2 ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో సంచలనం సృష్టించిన ధరణి, భూ భారతి కుంభకోణం కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు.
