క్వారంటైన్​లోకి 30 మంది ఎయిమ్స్​ సిబ్బంది

క్వారంటైన్​లోకి 30 మంది ఎయిమ్స్​ సిబ్బంది

న్యూఢిల్లీ: ఆలిండియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ​మెడికల్​ సైన్సెస్​(ఎయిమ్స్) కార్డియో న్యూరో సెంటర్ లో పని చేసే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు 30 మంది బుధవారం క్వారంటైన్​లోకి వెళ్లారు. న్యూరలాజికల్ ​ప్రాబ్లమ్​తో ట్రీట్​మెంట్​కు వచ్చిన 72 సంవత్సరాల పేషెంట్​కు కరోనా పాజిటివ్ ​వచ్చింది. బ్రెయిన్ ​స్ట్రోక్ తో రెండు రోజుల క్రితం ఎయిమ్స్​కు రావడంతో వెంటనే టెస్ట్​లు చేసి ఎమర్జెన్సీ ట్రీట్​మెంట్​ అందించడానికి న్యూరాలజీ వార్డులో అతడ్ని చేర్చారు. సీటీ, ఎమ్ ఆర్ఐ పరీక్షలు చేసి అబ్జర్వేషన్​లో ఉంచారు.

తనకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయని డాక్టర్లకు చెప్పాడు. దీంతో కరోనా టెస్ట్​చేయించగా అతడికి పాజిటివ్​గా తేలింది. వెంటనే ఆ పేషెంట్​ను కొవిడ్ హాస్పిటల్​గా మార్చిన ఎయిమ్స్ ​ట్రామా సెంటర్​కు తరలించామని ఒక అధికారి తెలిపారు. దీంతో అతనికి ట్రీట్​మెంట్ ​చేసిన 30 మంది హెల్త్ ​కేర్​ వర్కర్లందరూ క్వారంటైన్​లోకి వెళ్లిపోయారు.