దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ ప్రమాదక స్థాయికి చేరింది. ఢిల్లీ కాలుష్య పొగమంచుతో నిండిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిన పరిమితిని దాటి కాలుష్యం 65 రెట్లు ఎక్కువయింది. రికార్డు స్థాయిలో 507 AQI నమోదు అయింది.
-సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) రిపోర్టు ప్రకారం.. మానిటరింగ్ స్టేషన్‌లు చాలా పేలవమైన గాలి నాణ్యతను చూశాయి. దీపావళి తర్వాత 500 మార్క్‌ను దాటడంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధానిలో ఆదివారం ( నవంబర్ 3) ఉదయం 7 గంటలకు ప్రమాదకర 'ప్రమాదకర' కేటగిరీలో ఉంది.
IQAir వెబ్‌సైట్ డేటా ప్రకారం..ఢిల్లీ-NCR PM2.5 స్థాయిలు WHO సూచించిన పరిమితి కంటే 65 రెట్లు ఎక్కువ ప్రమాదకరంగా నమోదు అయింది. సాధారణంగా AQI 200 నుంచి 300 మధ్యలో ఉంటే గాలి నాణ్యత పేలవంగా ఉందని అర్థం..301నుంచి 400 ఉంటే చాలా పేలవంగా, 401 నుంచి450 వద్ద ఉంటే తీవ్రం, 450 కంటే ఎక్కువ ఉంటే ప్రమాదకర స్థాయిలో ఉందని డేటా చెబుతోంది. ఇది స్థానికంగా ఉండే వారికి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
12 గంటల్లో AQI 150 పాయింట్లపైనే..
ఢిల్లీలో 12 గంటల్లోనే AQI 327 నుంచి 507కి పెరిగింది. శనివారం రాత్రి 9 గంటలకు ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో AQI 327గా ఉండగా.. 507కి పెరిగింది. ఢిల్లీలో అన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ ప్రమాదకరస్థాయిలో రికార్డయింది.
అలీపూర్, ఆనంద్ విహార్, అశోక్ విహార్, ఆయా నగర్, బవానా, బురారీ, మధుర రోడ్, IGI విమానాశ్రయం, ద్వారకా, జహంగీర్‌పురి, ముండ్కా, నరేలా, పట్‌పర్‌గంజ్, రోహిణి, షాదీపూర్, సోనియా విహార్, వజీర్‌పూర్, మందిర్ మార్గ్, నెహ్రూ నగర్, నజాఫ్‌ఘర్ లలో AQI 500 మార్క్ దాటింది.