న్యూఢిల్లీ: ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో టెర్మినల్1.. ఎప్పుడు ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉండే టర్మినల్.. నిత్యంఈ టర్మినల్ నుంచి ఎన్ని విమాన సర్వీసులు దేశవిదేశాలకు వెళ్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అట్లాంటి బిజీ టెర్మినల్ ఇటీవల ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయిన విషయం తెలిసిందే. ఒకరు చనిపోయారు.. పలువురు గాయపడ్డారు. అయితే టెర్మినల్ నిర్మాణంలోనే ఏదో లోపం ఉందంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ టెర్మినల్ ల్ మరమ్మత్తులకోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ రెండు నెలలపాటు మూసివేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరమ్మతుల అనంతరం తిరిగి ఓపెన్ చేయబడు తుం దని అంచనా వేస్తున్నారు.
ALSO READ | ప్యూరిట్ బ్రాండ్ అమ్మేసిన హెచ్యూఎల్
జూన్ 28,2024 న న్యూఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ఇందిరాగాంధీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారు. అయితే ఈ టెర్మినల్ పునర్నిర్మాణానికి టెక్నికల్ స్టడీ నిర్వహించేందుకు ఐఐటీ ఢిల్లీకి చెందిన స్ట్రక్చరల్ ఇంజనీర్లను నియమించారు. వీరిచ్చే రిపోర్టు ఆధారంగా టెర్మినల్ నిర్మాణం, ఎప్పుడు తెరవాలో నిర్ణయించనున్నారు.
దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు ఒకటి. ప్రతి రోజులు ఈ ఎయిర్ పోర్టు నుంచి సుమారు 11 వందల విమాన సర్వీసులు నడుస్తాయి. ఇటీవల 8వేల కోట్లతో విస్తరణ చేపట్టారు.ఈ ఎయిర్ పోర్టు ద్వారా ప్రతి యేటా 100 మిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఎయిర్ పోర్టు ఇది. ఈ ప్రాజెక్టులో టెర్మినల్ 1 పరిధిలో విమాన రాకపోకలకు సంబంధించి ప్రయాణికుల కోసం రెండు భవనాలు నిర్మించారు.
