యాప్‌తో లిక్కర్ ఆర్డర్.. ఢిల్లీ సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీ

యాప్‌తో లిక్కర్ ఆర్డర్.. ఢిల్లీ సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీ

లిక్కర్ వినియోగదారులకు ఢిల్లీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా ఆంక్షల టైంలో.. లిక్కర్ హోం డెలివరీకి అనుమతినిచ్చింది. ఆన్ లైన్‌లో మద్యం ఆర్డర్ చేసుకునేలా కేజ్రీవాల్ సర్కారు కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. గతంలోనూ లిక్కర్ హోం డెలివరీకి అనుమతి ఉంది. ఎల్ 13 లైసెన్స్ కలిగి ఉండి.. ఈ మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా వచ్చిన ఆర్డర్లకు మాత్రమే మద్యం డెలివరీ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన పాలసీ ప్రకారం.. ఎల్ 14 లైసెన్స్ కలిగి ఉండి.. మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో వచ్చిన ఆర్డర్లకు కూడా లిక్కర్ డెలివరీ చేసే అవకాశం  కల్పించారు. 

గతేడాది లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు ఢిల్లీలో మధ్యం షాపుల ముందు జనాలు భారీగా క్యూకట్టారు. దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. కాబట్టి మధ్యాన్ని హోం డెలివరీ చేయాలని వినియోగదారులు కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు కూడా మధ్యం హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.