హైదరాబాద్కు చేరుకున్న ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు

హైదరాబాద్కు చేరుకున్న ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు

రేపు (జనవరి 18) ఖమ్మంలో జరగబోయే బీఆర్ఎస్ అవిర్భావ సభకు హాజరయ్యేందుకు ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ హైదరాబాద్కు చేరుకున్నారు. మరోవైపు సీపీఐ జాతీయ నాయకులు డి రాజా కూడా హైదరాబాద్​ వచ్చారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులకు బేగంపేట ఎయిర్పోర్టులో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహముద్ ఆలీ స్వాగతం పలికారు. బీఆర్ఎస్, ఆప్  కార్యకర్తలు వారికి ఘనస్వాగతం పలికారు. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న డి రాజాకు సీపీఐ, బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా నాయకులు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా హైదరాబాద్కు వస్తారని తెలుస్తోంది. 

బుధవారం సీఎం కేసీఆర్ యాదాద్రికి వెళ్లి.. లక్ష్మీ నరసింహాస్వామిని దర్శనం చేసుకోనున్నారు. కేసీఆర్ తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు మరికొంతమంది జాతీయ నాయకులు కూడా స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఖమ్మం సభకు చేరుకుంటారు. ముందుగా ఖమ్మం జిల్లా కొత్త కలెక్టరేట్‌‌‌‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. నలుగురు ముఖ్యమంత్రులతో పాటు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్​, సీపీఐ సీనియర్ నేత డి.రాజా చేతుల మీదుగా కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో లీడర్లు పాల్గొంటారు. అతిథులకు కప్పే శాలువాలను నారాయణపేట, పోచంపల్లి నుంచి తెప్పిస్తున్నారు.