హాయ్ స్వీట్ బేబీ.. ఎలా ఉన్నావ్.. : ఢిల్లీ బాబా చిలిపి చాటింగ్ వైరల్

హాయ్ స్వీట్ బేబీ.. ఎలా ఉన్నావ్.. : ఢిల్లీ బాబా చిలిపి చాటింగ్ వైరల్

లైంగిక వేధింపుల కేసులో  దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల క్రితం  స్వయంప్రకటిత స్వామి చైతన్యానంద సరస్వతి (62) అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న బాబా చాటింగ్ లీక్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 వామ్మో ముసలోడే గానీ మహానుభావుడన్నట్లు ఉంది  స్వామి చైతన్యానంద సరస్వతి తీరు. ఇన్ స్టిట్యూట్ లో ఉండే అమ్మాయిల కదలికలను అబ్జర్వ్ చేసి వారిని లైంగికంగా వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. తాను వేధించడమే గాకుండా అమ్మాయిలను బ్రోకర్ దందాగా తెరలేపాడు. ఓ అమ్మాయితో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ లేటెస్ట్ గా సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. స్వీట్ గర్ల్, హవ్ ఆర్ యూ బేబీ..ఎలా ఉన్నావ్..ఏం చేస్తున్నావ్..గుడ్ నైట్, నాతో పడుకోవా.?  ఈ విధంగా ఉంది చైతన్యానంద స్వామి భాగోతం.

ALSO READ : పిల్లల్లో రెండోసారి కోవిడ్ వస్తే.. డేంజరేనా?.

 చైతన్యానంద సరస్వతికి, ఆయన డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్-రీసెర్చ్ మహిళా విద్యార్థులకు మధ్య జరిగిన కొన్ని లీక్ అయిన మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  లీకైన  స్క్రీన్ షాట్స్ లో  ఎలాంటి మెసేజ్ లు ఉన్నాయంటే.. 

ఒక స్క్రీన్ షాట్ లో  గుడ్ మార్నింగ్ బేబీ, స్వీటీ బేబీ ఎక్కడున్నావు, నా మీద ఎందుకు కోపం అని  ఢిల్లీ బాబా మెసేజ్ చేయగా... దానికి రిప్లై ఇచ్చిన విద్యార్థి నిద్రపోతున్నా సర్..రేపు ఫోన్ చేస్తా అని చెప్పింది. దీనికి  నాతో పడుకోవా?  చెప్పు అని ఢిల్లీ బాబా  బదులిచ్చాడు. మరో చాట్ లో  ఒక దుబాయ్ షేక్ సెక్స్ పార్టనర్ కావాలంటున్నాడు, మీకు ఎవరైనా మంచి స్నేహితులు ఉన్నారా? అని అడిగాడు బాబా. దీనికి    కోయి నహీ హై (ఎవరూ లేరు)అని రిప్లై ఇచ్చింది యువతి. ఈ చాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బాబా ఫోన్ ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. 


విద్యార్థినీలకు వేధింపులు

ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఇన్ స్టిట్యూట్ లో 17 మంది విద్యార్థినులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయంప్రకటిత స్వామి చైతన్యానంద సరస్వతి (62) ని ఢిల్లీ పోలీసులు సెప్టెంబర్ 28న  అరెస్టు చేశారు.  ఆగ్రాలోని ఓ హోటల్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కస్టడీ కోసం నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడి నుంచి ఒక ఐప్యాడ్, మూడు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రైవేటు ఇన్ స్టిటూట్ లోని క్యాంపస్, హాస్టల్ లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ఒక ఫోన్ కు అనుసంధానించారు. దీంతో హాస్టల్, క్యాంపస్ లో విద్యార్థినుల కదలికలను నిందితుడు మానిటర్  చేస్తున్నాడు. 

అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అతను బృందావన్  లోని వేర్వేరు ప్రదేశాల్లో దాక్కున్నాడని, తరచూ హోటళ్లు మారాడని పోలీసులు తెలిపారు. తనను గుర్తించకుండా ఉండేందుకు పలు చీప్  హోటళ్లలో కూడా దాక్కున్నాడని వెల్లడించారు పోలీసులు.