health alert: పిల్లల్లో రెండోసారి కోవిడ్ వస్తే.. డేంజరేనా?..అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే

health alert: పిల్లల్లో రెండోసారి కోవిడ్ వస్తే.. డేంజరేనా?..అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే

ప్రపంచాన్ని వణికించిన కోవిడ్​ మహమ్మారి పీడ ఇంకా పోలేదు.. మూడేళ్ల క్రితం కంట్రోల్​ లోకి వచ్చిన  కోవిడ్​.. ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ముఖ్యంగా పిల్లల్లో  రెండోసారి కోవిడ్​ వస్తే ప్రమాదమే అంటున్నారు డాక్టర్లు. మొదటి ఇన్ఫెక్షన్‌తో పోలిస్తే రెండవ ఇన్ఫెక్షన్ తర్వాత పిల్లలు రెట్టింపు లాంగ్​ కోవిడ్​ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని US అధ్యయనంలో వెల్లడైంది. ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ప్రచురించబడిన ఈ పరిశోధనలో 4లక్షల 60వేల మంది పిల్లలపై ప్రయాగాలు చేయగా ఇన్ఫెక్షన్ ప్రమాదాలను హైలైట్ చేసింది. అలసట ,మెదడు మసకబారడం వంటి లక్షణాలు యువ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెబుతోంది. వివరాల్లోకి వెళితే.. 

లాంగ్​ కోవిడ్​ ప్రమాదం అంటే.. 

నిరంతర అలసట, తలనొప్పి లేదా మైగ్రేన్లు, మెదడు మసకబారడం, ఏకాగ్రత సమస్యలు, నిరంతరం దగ్గు లేదా శ్వాస సమస్యలు, కడుపు నొప్పి, నిద్ర భంగం, కీళ్ల లేదా కండరాల నొప్పి వంటి సమస్యలు దీర్ఘకాలికంగా కొనసాగుతాయని అధ్యయనంలో తేలింది.  కొంతమంది పిల్లలు వారాలలో కోలుకుంటారు. మరికొందరు ఈ లక్షణాలతో నెలల తరబడి బాధపడుతుంటారు. ఇది వారి దైనందిన కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని స్టడీస్​స్పష్టం చేస్తున్నాయి. 

అధ్యయనం ఎవరిపై, ఎలా చేశారు..

2022 ప్రారంభం నుంచి 2023 చివరి వరకు పెట్టిన పిల్లలు ఓమిక్రాన్ యుగం బోర్న్​ బేబీస్​ అంటారు.. అమెరికా అంతటా 40 ఆసుపత్రుల నుంచి వీరి  డేటాను తీసుకుని అధ్యయనం చేశారు. పిల్లలలో మొదటి ,రెండవ COVID-19 ఇన్ఫెక్షన్ల తర్వాత ట్రాక్ చేయబడిన ఫలితాలు స్టడీ చేశారు. నెలల తరబడి కొనసాగే దీర్ఘకాలిక COVID ని లక్షణాలను వారిలో గుర్తించారు. ఇది పెరుగుతున్న ఆందోళనల మధ్య నివారణ ,టీకాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. 

పేరెంట్స్​ ఏం చేయాలంటే.. 

పిల్లల్లో రెండోసారి కోవిడ్​ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని స్టడీస్​ చెబుతున్నాయి. పరిశుభ్రత పాటించడం, ఇంటిలోపల సరియైన వెంటిలేషన్, బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్​ ధరించడం, దీర్ఘ కాలిక కోవిడ్​ రాకుండా టీకాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలంటున్నారు. భయపడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ, జాగ్రత్తగా ఉండటం వల్ల బిడ్డకు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.