మోడీ బర్త్ డే.. 56 ఇంచుల స్పెషల్ థాలి

మోడీ బర్త్ డే.. 56 ఇంచుల స్పెషల్ థాలి

సెప్టెంబర్ 17న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలో ఉన్న ARDOR 2.0 రెస్టారెంట్ స్పెషల్ థాలీని ఏర్పాటు చేస్తోంది. దీనికి ‘56 అంగుళాల మోడీజీ’ అని పేరు పెట్టారు. ఇందులో 56 ఫుడ్స్ ఐటమ్స్ ఉండనున్నాయి. వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ను ఎంచుకొనే సౌకర్యం కస్టమర్లకు కల్పిస్తోంది. ప్రధాన మంత్రి మోడీని తాను చాలా గౌరవిస్తానని, దేశానికి ప్రధాని కావడం గర్వకారణమని ARDOR 2.0 రెస్టారెంట్ యజమాని సుమిత్ కలారా వెల్లడించారు.

ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక బహుమతి ఇవ్వాలని అనుకోవడం జరిగిందన్నారు. ఆయన ఇక్కడకు వచ్చి తినాలని తాము కోరుకుంటున్నామన్నారు. కానీ.. భద్రతా కారణాల వల్ల సాధ్యం కాదనే సంగతి తెలుసని.. ఆయన్ను ఇష్టపడే అభిమానులు ఇక్కడకు రావాలని సూచించారు. ఒకరైనా లేక జంట 40 నిమిషాల్లో థాలీ పూర్తిగా తిన్న వారికి రూ. 8.5 లక్షలను బహుమతిగా ఇస్తామని, విజేతలను కేదర్ నాథ్ లో పర్యటించే ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుంచి 26వ తేదీ వరకు థాలీని అందిస్తామని వెల్లడించారు.