ఢిల్లీ క్యాబ్ డ్రైవర్ల నిర్వాకం: ఫస్ట్ ఎయిడ్ బాక్సులో కండోమ్ ప్యాకెట్లు

ఢిల్లీ క్యాబ్ డ్రైవర్ల నిర్వాకం: ఫస్ట్ ఎయిడ్ బాక్సులో కండోమ్ ప్యాకెట్లు

ఢిల్లీ క్యాబ్ డ్రైవర్లు తమ కార్లలో ఫస్ట్ ఎయిడ్ బాక్సులో కండోమ్ ప్యాకెట్ ను మ్యాన్‌డేటరీగా మేంటెన్ చేస్తున్నారు. ఇందుకు కారణం అడుగగా.. తాము పలు సార్లు కండోమ్ ప్యాకెట్‌ను ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఉంచుకోలేదని పోలీసులకు ఫైన్ వేసినట్టుగా చెప్పారు. అయితే వాళ్లు కట్టిన ఫైన్ రిసిప్ట్ ను పరిశీలించగా అది స్పీడింగ్ కు చెందిన ఫైన్‌గా తేలింది.

ఢిల్లీకి చెందిన చాలా మంది క్యాబ్ డ్రైవర్లు మాత్రం కండోమ్ ప్యాకెట్‌ను తప్పనిసరి ఫస్ట్ ఎయిడ్ బాక్సులలో ఉంచుకోవాలని నమ్ముతున్నారు. ఈ విషయంపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సంప్రదించగా… తాము అలాంటి రూల్స్ ఏమీ పెట్టలేదని చెప్పారు.  డ్రైవర్లు ఎందుకు అలా నమ్ముతున్నారో తెలియడంలేదని అన్నారు. ఈ మధ్య వచ్చిన ట్రాఫిక్ రూల్స్ లో కూడా కండోమ్‌లకు సంబంధించిన ఎటువంటి ఉత్తర్వులు జారీకాలేదని చెప్పారు.