ఐపీఎల్ సీజన్-12లో భాగంగా బుధవారం హైదరాబాద్ సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య విశాఖలోని ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ మైదానంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి ఢిల్లీ జట్టు ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. హైదరాబాద్ జట్టులో గప్తిల్ 38(19బంతుల్లో, 4 సిక్సులు, ఒక ఫోరు), మనీశ్ పాండే 30(36బంతుల్లో, 3 ఫోర్లు), విజయ్ శంకర్ 25(11బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులు) రన్స్ తీశారు.
మరి కొద్దిసేపట్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన బ్యాటింగ్ ను ప్రారంభించనుంది.
