డబ్ల్యూపీఎల్‌‌లో ఢిల్లీ వరుసగా రెండో విజయం

డబ్ల్యూపీఎల్‌‌లో ఢిల్లీ వరుసగా రెండో విజయం
  •     42 రన్స్‌‌ తేడాతో యూపీ వారియర్స్‌‌కు చెక్‌‌
  •     చెలరేగిన లానింగ్‌‌, జొనాసెన్‌‌, జెమీమా
  •     తహ్లియా ఒంటరి పోరాటం వృథా

ముంబై: విమెన్స్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ (డబ్ల్యూపీఎల్‌‌)లో ఢిల్లీ క్యాపిటిల్స్‌‌ బ్యాటర్లు దుమ్మురేపారు. కెప్టెన్‌‌ మెగ్‌‌ లానింగ్‌‌ (42 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 70), జెస్‌‌ జొనాసెన్‌‌ (20 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 నాటౌట్‌‌), జెమీమా రొడ్రిగ్స్‌‌ (22 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 34 నాటౌట్‌‌) దంచికొట్టడంతో.. వరుసగా రెండోసారి రెండొందలకు పైగా టార్గెట్‌‌ నిర్దేశించడంతో పాటు రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. దీంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో డీసీ 42 రన్స్‌‌ తేడాతో యూపీ వారియర్స్‌‌కు చెక్‌‌ పెట్టింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 211 /4  స్కోరు చేయగా, యూపీ 20 ఓవర్లలో 169/5 స్కోరుకే పరిమితమైంది. తహ్లియా మెక్‌‌గ్రాత్‌‌ (50 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 నాటౌట్‌‌) టాప్‌‌ స్కోరర్‌‌. జొనాసెన్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

దంచికొట్టి..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన డీసీ ఇన్నింగ్స్‌‌లో ఆరంభంలో లానింగ్‌‌, స్లాగ్‌‌ ఓవర్లలో జొనాసెన్‌‌ దంచికొట్టారు. తొలి రెండు ఓవర్లలో లానింగ్‌‌ రెండు ఫోర్లు బాదితే, తర్వాతి రెండు ఓవర్లలో లానింగ్‌‌, షెఫాలీ (17) చెరో సిక్సర్‌‌ దంచారు. 5వ ఓవర్‌‌లో లానింగ్‌‌ 6, 4, 4తో 16 రన్స్‌‌ రాబట్టింది. 6వ ఓవర్‌‌లో ఇద్దరు చెరో రెండు ఫోర్లు బాదడంతో పవర్‌‌ప్లేలో డీసీ స్కోరు 62/0కి చేరింది. కానీ తర్వాతి ఓవర్‌‌లో షెఫాలీ ఔట్‌‌కావడంతో తొలి వికెట్‌‌కు 67 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. పవర్​ ప్లే తర్వాత కాప్‌‌ (16) మెల్ల గా ఆడినా, లానింగ్‌‌ సిక్స్‌‌తో జో రు పెంచింది. ఈ దశలో వ ర్షం రావడంతో ఇన్నింగ్స్‌‌కు కా సేపు అంతరాయం కలిగినా, 10 ఓవర్లలో డీసీ స్కోరు 96/1కు పెరిగింది.

11వ ఓవర్‌‌లో కాప్‌‌ ఔటైనా.. లానింగ్‌‌ 3 ఫోర్లు కొట్టి 12వ ఓవర్​లో ఔటైంది. దీంతో డీసీ 112 రన్స్‌‌ వద్ద 3వ వికెట్‌‌ కోల్పోయింది. తర్వాత జెమీమా రొడ్రిగ్స్​ జోరందుకోగా, సిక్స్‌‌తో ఖాతా తెరిచిన కాప్సే(21) క్రీజులో ఉన్నంతసేపు అల్లాడించింది. 14వ ఓవర్‌‌లో 6 కొట్టిన కాప్సే తర్వాతి ఓవర్‌‌లో ఔట్‌‌కావడంతో నాలుగో వికెట్‌‌కు 32 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. డీసీ స్కోరు 144/4గా మారింది. ఇక జొనాసెన్‌‌ రాకతో హిట్టింగ్‌‌ మరో స్థాయికి వెళ్లింది. రొడ్రిగ్స్‌‌తో 9 బాల్స్‌‌ను రొటేట్‌‌ చేసినా జొనాసెన్‌‌.. 4, 6, 4, 6, 4, 4, 4, 6తో విరుచుకుపడింది. మధ్యలో రొడ్రిగ్స్‌‌ సింగిల్స్‌‌ తీస్తూ చివర్లో ఓ ఫోర్‌‌ కొట్టింది. దీంతో ఐదో వికెట్‌‌కు 34 బాల్స్‌‌లోనే 67 రన్స్‌‌ జతకావడంతో డీసీ భారీ స్కోరు చేసింది.