PBKS vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. పంజాబ్ జట్టులో ఆసీస్ స్టార్స్

PBKS vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. పంజాబ్ జట్టులో ఆసీస్ స్టార్స్

ఐపీఎల్ 2025లో శనివారం (మే 24) పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్ వేదికగా సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇదే చివరి మ్యాచ్. వరుస ఓటములతో ఉన్న ఢిల్లీ విజయంతో సీజన్ ముగించాలని భావిస్తుంది. మరో వైపు పంజాబ్ ఈ మ్యాచ్ లో గెలిచి టాప్-2 కు చేరువవ్వాలని టార్గెట్ గా పెట్టుకుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే పంజాబ్ జట్టులో ఇంగ్లిస్, స్టోయినిస్ చోటు సంపాదించారు. ఇక ఢిల్లీ జట్టులో  సెడిఖుల్లా అటల్, మోహిత్ శర్మలకు ప్లేయింగ్ 11 లో ఛాన్స్ దక్కింది.     

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), సెడిఖుల్లా అటల్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్(వికెట్ కీపర్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముస్తాఫిజుర్ రెహమాన్, ముఖేష్ కుమార్