కాశ్మీర్​ను బీజేపీ హ్యాండిల్​ చేయలేదు

కాశ్మీర్​ను బీజేపీ హ్యాండిల్​ చేయలేదు
  • జన్​ ఆక్రోశ్​ ర్యాలీలో కేజ్రీవాల్

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్​లో కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడులకు దిగుతున్నారని, అయినా కేంద్రం ఏం చేయట్లేదని ఢిల్లీ సీఎం అరవింద్ ​కేజ్రీవాల్ ​విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కాశ్మీర్​ను హ్యాండిల్​ చేయలేదని, ఇలాంటి దాడులు ఆపేందుకు యాక్షన్ ​ప్లాన్ ​కూడా లేదని గుస్సా అయ్యారు. లోయలో జరుగుతున్న వరుస హత్యలకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జంతర్​ మంతర్ ​వద్ద జన్ ​ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించగా.. కేజ్రీవాల్ ​పాల్గొని మాట్లాడారు. కాశ్మీరీ పండిట్లు మళ్లీ జమ్మూను వదిలేస్తున్నారని, 1990 నాటి పరిస్థితులు రిపీట్​అవుతున్నాయన్నారు. బీజేపీ డర్టీ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. కాశ్మీర్​లో టెర్రరిస్టు దాడులకు పాకిస్తాన్ ​ మద్దతిస్తోందన్నారు. కాశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో  అంతర్భాగంగానే ఉంటుందని తేల్చి చెప్పారు. మే 1 నుంచే టెర్రరిస్టులు ఈ దాడులు చేస్తున్నారని, ఇప్పటిదాకా 8 మంది చచ్చిపోయారని కేజ్రీవాల్​ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం...

జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణపై నీలినీడలు 

చీర మీద పెండ్లి కొడుకు పెండ్లి పిల్ల