CBSE  పరీక్షలు రద్దు చేయండి

CBSE  పరీక్షలు రద్దు చేయండి

దేశంలో కరోనా వ్యాప్తి కేసులు ఎక్కువ అవుతుండటంతో CBSE(10, 12వ తరగతి) పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. కరోనా విజృంభణ దృష్ట్యా CBSE ఈ పరీక్షలు రద్దు చేయాలంటూ ఢిల్లీ  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో 6లక్షల మంది CBSE పరీక్షలు రాయాల్సి ఉందని.. ఒకవేళ వీటిని నిర్వహిస్తే పరీక్షా సెంటర్లు  కరోనా హాట్‌ స్పాట్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయం ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

ఢిల్లీలో గడిచిన 24గంటల్లో 13,500 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేజ్రీవాల్ తెలిపారు. పరీక్షల నిర్వహణలో దాదాపు లక్షమంది సిబ్బంది పాల్గొంటారని.. ఈ సమయంలో విద్యార్థులు, టీచర్లకు కరోనా  సోకే ప్రమాదం ఉందన్నారు. తప్పనిసరి అనుకుంటే CBSE విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలని కేంద్రానికి సూచించారు. చాలా దేశాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని..కేంద్ర వీటిపై మరోసారిక ఆలోచించాలన్నారు.

CBSE 10,12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఈ పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్‌ ఎక్కువ అవుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా నాలుగో ఉద్ధృతి కొనసాగుతోందని..మునుపటి విజృంభణ కంటే ఇది ప్రమాదకరమైందన్నారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో కరోనా తీవ్రత దృష్ట్యా అత్యవసరం అనుకుంటేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.