ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం

ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఇవాళ సొంత ప్రభుత్వంపైనే.. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడుపోరని నిరూపిస్తామని ప్రకటించారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, అవినీతి పేరుతో తమ నాయకులను కొనేందుకు బీజేపీ.. ఆపరేషన్ లోటస్ చేపట్టందని గతంలోనే  కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగరని నిరూపించేందుకు విశ్వాస తీర్మాన్ని ప్రకటించారు.

ఈ బల పరీక్ష ద్వారా ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ కాస్తా.. ఆపరేషన్ కీచడ్ గా మారనుందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 ఎమ్మెల్యేలకు గానూ ఆప్ కు 63 మంది సభ్యుల బలం ఉంది. సాధారణంగా మెజారిటీ నిరూపించుకోవాలని.. ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతాయి. అయితే అధికార పార్టీలు కూడా కాన్పిడెన్స్ మోషన్ ను సభలో ఎప్పుడైనా ప్రవేశ పెట్టొచ్చని చెప్పారు.