
ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. కేసులు ఎక్కువ అవుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26 వరకు లాక్‌డౌన్ విధించింది. కానీ, ఆ తర్వాత కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. మరో వారంపాటు లాక్‌డౌన్ పొడిగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం ప్రెస్‌మీట్ పెట్టి ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఢిల్లీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఇంకా కరోనా అదుపులోకి రాలేదు. అందుకే మరో వారంపాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నాం. లాక్‌డౌన్ వల్ల పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రజలు కూడా లాక్‌డౌన్ పొడిగించడానికే మొగ్గుచూపుతున్నారు. ఢిల్లీకి 700 టన్నుల ఆక్సిజన్ అవసరముంది. ఆక్సిజన్ కొరత ఉన్న ఆస్పత్రులకు వెంటనే అందేలా చూస్తున్నాం’ అని ఆయన అన్నారు.