రోడ్డుపై నమాజ్ చేసిండని..యువకుడిని తన్నిన పోలీస్

రోడ్డుపై నమాజ్ చేసిండని..యువకుడిని తన్నిన పోలీస్
  •     ఢిల్లీలో ఘటన.. సస్పెన్షన్ వేటు 

న్యూఢిల్లీ : రోడ్డుపై నమాజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ముస్లింలపై దరుసుగా ప్రవర్తించిన ఓ పోలీసు అధికారి సస్పెండ్ అయ్యారు. ఢిల్లీ ఇందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోక్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలోని పోలీస్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌కు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా ఆ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ పనిచేస్తున్నాడు. శుక్రవారం కావడంతో ఆ పక్కనే మసీదు ముందు రోడ్డుపై కొందరు నమాజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. రోడ్డుపై ప్రార్థనల పట్ల ఆగ్రహం చెందిన ఆయన  దురుసుగా ప్రవర్తించాడు. నమాజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న వారిని పక్కకి తోసేశాడు. 

మరో ఇద్దరు వ్యక్తులను వెనుక నుంచి కాలుతో తన్నాడు. ఇంకొకరిని మెడపై కొట్టాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌‌‌‌‌గా మారింది. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఆ పోలీస్ ను వెంటనే సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంకే మీనా తెలిపారు.