తనిఖీ చేయడానికి వచ్చిన ట్రాఫిక్ పోలీసుకు ముచ్చెమటలు పట్టించాడు ఓ కారు డ్రైవర్. కారుపై ఎక్కిన ట్రాఫిక్ పోలీసును రెండు కిలోమీటర్లు ఆగకుండా తీసుకెళ్లాడు. 2019 నవంబర్ లో ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతేడాది నవంబర్ లో ఢిల్లీలోని నాంగ్లోయి చౌక్ వద్ద వాహనాల పేపర్లను తనిఖీ చేస్తుండగా, ఒక వ్యక్తి కారు మరొక వైపు నుండి వచ్చింది. పోలీసులు ఆ వ్యక్తిని ఆపమని కోరారు. ఆపినట్టు నమ్మించిన ఆ కారు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో సునీల్ అనే ట్రాఫిక్ పోలీస్ వాళ్లను పట్టుకోవడానికి ఆ కారు బొనెట్ పైకి దూకాడు. అయినా ఆగకుండా కారును దాదాపు రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు డ్రైవర్. తర్వాత ట్రాఫిక్ పోలీసు బతిమాలాడంతో స్పీడ్ తగ్గించడంతో అపుడు ట్రాఫిక్ పోలీస్ కారు దిగాడు. తర్వాత వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనను కారులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీసుకు గాయాలయ్యాయి. తర్వాత ఉన్నతాధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు.
see more news
