ఇవాళ ఢిల్లీ హైకోర్టు ముందుకు కేజ్రీవాల్ పిటిషన్

ఇవాళ ఢిల్లీ హైకోర్టు ముందుకు కేజ్రీవాల్ పిటిషన్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో తన అరెస్ట్​ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం ఢిల్లీ హైకోర్టు ముందుకు రానుంది. బుధవారం ఈ పిటిషన్ ను జస్టిస్ స్వరణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారించనుంది. లిక్కర్ స్కాంలో విచారణకు హాజరుకావాలని ఈడీ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించ కపోవడంతో.

ఈ నెల 21న ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.22వ తేదీన రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆయనను హాజరుపరిచారు. కేసు వ్యవహారంలో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే కేవలం ఏడు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది.ఈ కస్టడీ సమయం రేపటి(గురువారం)తో ముగియనుంది.