ఢిల్లీలో శనివారం 20వేల కొవిడ్ కేసులు

ఢిల్లీలో శనివారం 20వేల కొవిడ్ కేసులు

ఢిల్లీలో ఇవాళ (శనివారం) ఒక్క రోజే 20 వేల కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు ఢిల్లీ హెల్త్ మినిష్టర్ సత్యేందర్. అంతేకాదు.. పాజిటివిటీ రేటు 20శాతంగా ఉందని తెలిపారు. గురువారం కరోనావైరస్ ఇన్ఫెక్షన్ ఎదుర్కొన్న రోగులందరిలో కమోర్బిడిటీస్ ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అయితే..హాస్పిటల్ అడ్మిషన్స్ ఈ సమయంలో చాలా తక్కువగా ఉన్నాయని.. ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగానే ఉండి రోజుకు 20వేల కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. సిటీలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ వేరియంట్ కేరణంగా ఒక్కరు కూడా మృతి చెందలేదని తెలిపారు సత్యేందర్.

కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం అలర్ట్ గా ఉందని.. అవసరమైన పరికరాలను అందుబాటులో  ఉండేలా చర్యలు తీసుకుందని  తెలిపారు హెల్త్ మినిష్టర్ సత్యేందర్. ఇప్పటి వరకూ ఢిల్లీ ఆస్పత్రుల్లో  10శాతం బెడ్లు మాత్రమే  పేషంట్లతో నిండిపోయాయని అన్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో చేరే వారి  సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందన్నారు సత్యేందర్. ప్రస్తుతం ఢిల్లీలో 40వేల యాక్టివ్ కేసులు ఉండగా.. 10శాతం బెడ్లు మాత్రమే ఫుల్ అయ్యాయన్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో 40వేల యాక్టివ్ కేసులున్నప్పుడు ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యేందుకు పేషెంట్లు ఎక్కువగా వచ్చేవారన్నారు.

తేలికపాటి లక్షణాలుంటే.. హోం ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు హెల్త్ మినిష్టర్ సత్యేందర్.

మరిన్ని వార్తల కోసం..

కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం