ఆ 20 మంది తబ్లిగీలు ఎక్కడ?

ఆ 20 మంది తబ్లిగీలు ఎక్కడ?
  • జమాతే చీఫ్ కుమారున్ని ప్రశ్నించిన పోలీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీలోని మర్కజ్ జమాతే చీఫ్ కుమారున్ని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించారు. మర్కజ్ లో సమావేశాలకు హాజరై వారిలో కొంతమంది కరోనా బారిన పడటంతో…అసలు ఈ సమావేశాలను నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించారంటూ 20 మంది పై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ 20 మంది పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు జామాతే చీఫ్ కుమారున్ని సైతం ప్రశ్నించారు. వారి అచూకీ తెలిస్తే చెప్పాలంటూ కోరారు. పరారైన వారి ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ తో పాటు సమాచారాన్ని సేకరించారు. మౌలానా చీఫ్ సాద్ కుమారుడికి తబ్లీగ్ జమాత్ కార్యకలాపాలతో సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో వారి జాడ తెలిసి ఉంటుందేమోనని విచారించామని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న జామతే సభ్యులకు కరోనా సోకిందా వారి కారమంగా ఇతరులకు కరోనా సోకే అవకాశం ఉంటుందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. మర్కజ్ సమావేశాల తర్వాతే దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిందంటూ పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.