అఫ్గాన్ టెర్రరిస్టులకు అడ్డా కాకూడదు

అఫ్గాన్ టెర్రరిస్టులకు అడ్డా కాకూడదు

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌ పరిణామాలపై పలు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి అధికారులతో కలసి భారత ప్రభుత్వం ఓ సదస్సు నిర్వహించింది. ఢిల్లీ రీజినల్ సెక్యూరిటీ డైలాగ్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహించారు. రష్యా, ఇరాన్‌తోపాటు మరో ఆరు దేశాల భద్రతా సలహాదారులు ఈ సదస్సుకు హాజరయ్యారు. 

అఫ్గాన్ భూభాగం ఎటువంటి టెర్రరిస్టు కార్యకలాపాలకు అడ్డా కాకూడదని భేటీలో పాల్గొన్న దేశాలు నిర్ణయించాయి. ఉగ్రవాదులకు అఫ్గాన్ ఆవాసంగా మారకూడదని.. అక్కడ టెర్రరిస్టులకు ట్రెయినింగ్ లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సమ్మిట్‌లో పాల్గొన్న అధికారులు వ్యాఖ్యానించారు. తాలిబాన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్నాక అక్కడి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై చర్చించారు. వీటితోపాటు టెర్రరిజం, ర్యాడికలైజేషన్, డ్రగ్ ట్రాఫికింగ్ గురించి సదస్సులో చర్చించారు. 

మరిన్ని వార్తల కోసం: 

కేసీఆర్ మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నరు

గుడిలో పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ పూజలు!

కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడి మసైతరు: మోత్కుపల్లి