గుడిలో పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ పూజలు!

గుడిలో పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ పూజలు!

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులకు ఆ దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ అండగా నిలిచారు. కరాక్ జిల్లాలోని తేరి గ్రామంలో ఉన్న శ్రీ పరమ హన్స్‌ జీ మహారాజ్ ప్రాచీన హిందూ ఆలయాన్ని గతేడాది డిసెంబర్‌లో కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న సీజే.. ఆలయాన్ని ప్రభుత్వమే పునర్నిర్మించేలా చేశారు.   

గుడి నిర్మాణానికి అయ్యే ఖర్చును ధ్వంసం చేసిన వారి నుంచే రాబట్టాలని గుల్జార్ అహ్మద్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అదే స్థానంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మించింది. దీపావళి నేపథ్యంలో గుడిని తిరిగి తెరిచారు. ఈ కార్యక్రమంలో గుల్జార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. దీపావళి పండుగను కూడా జరుపుకున్న సీజే గుల్జార్.. మైనార్టీల హక్కులను పాక్ సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ పరిరక్షిస్తుందన్నారు. ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. దేశంలోని పౌరులందరూ సమానమేనన్నారు.

మరిన్ని వార్తల కోసం: 

పెళ్లి చేసుకున్న నోబెల్ గ్రహీత మలాలా

కరోనా సోకడంతో ఉరిశిక్ష వాయిదా

ఐసీడీఎస్​లో గ్రేడ్​-2 సూపర్​వైజర్లకు నోటిఫికేషన్