మనీష్ సిసోడియా ఆఫీసులో మళ్లీ సీబీఐ సోదాలు

మనీష్ సిసోడియా ఆఫీసులో మళ్లీ సీబీఐ సోదాలు

సీబీఐ తన ఆఫీసులో మరోసారి సోదాలు నిర్వహించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. అయితే తనిఖీల్లో ఏమీ దొరకలేదని ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు మళ్లీ  సీబీఐ అధికారులు నా కార్యాలయానికి వచ్చారు. వారిని సాదరంగా స్వాగతిస్తున్నా. నా ఇల్లు, నా కార్యాలయంల్లో సోదాలు నిర్వహించారు. నా లాకర్‌ను తనిఖీ చేశారు, నా స్వగ్రామానికి వెళ్లి తనిఖీలు చేశారు. అయినా వారికి ఏమి దొరకలేదు. నేను ఎలాంటి తప్పుచేయనందునే వారికి ఏమి దొరకలేదు. ఢిల్లీలో పిల్లల విద్య కోసం నిజాయితీగా పనిచేస్తున్నా’’ అని సిసోడియా ట్వీట్ లో రాసుకొచ్చారు.  

మనీష్ సిసోడియా ఆఫీసులో సోదాల విషయాన్ని దర్యాప్తు సంస్థ ఖండించింది. సిసోడియా కార్యాలయంతో ఎలాంటి తనిఖీలు చేయలేదని సీబీఐ ప్రకటించింది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా కొన్ని డాక్యుమెంట్ల కోసం సీబీఐ అధికారులు డిప్యూటీ సీఎం ఆఫీసుకు వెళ్లారని, సోదాలు నిర్వహించలేదని సమాచారం.