కొత్త సంవత్సరంలో మొదటిరోజే కంపించిన భూమి

కొత్త సంవత్సరంలో మొదటిరోజే కంపించిన భూమి

కొత్త సంవత్సరంలో మొదటి రోజే దేశంలోని పలుచోట్ల భూమి కంపించింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు గానీ, నష్టం గానీ జరగలేదని పేర్కొంది. ఆదివారం తెల్లవారుజామున హర్యానాలోని ఝజ్జర్ లో రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ చెప్పింది. 

భూకంపం ధాటికి ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. అయితే హర్యానాలో భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. భూ ఉపరితలానికి 5 కిలోమీటర్లలో లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. అంతకు ముందు నవంబర్ నెలలో నేపాల్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపం వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ ప్రకంపనలు వచ్చాయి.