
న్యూఢిల్లీ: అదితి సింగ్.. ఓ 20 ఏళ్లుంటయ్.. ఎథికల్ హ్యాకర్‌గా పని చేస్తోంది. హ్యాకింగ్ చేసే డబ్బులు దోచేసే బ్యాచ్ అమ్మాయి కాదు.. పెద్దపెద్ద టెక్నాలజీ ప్రోగ్రామ్స్‌లో తప్పులను గుర్తించే యువతి. అట్లనే రెండు నెలల కిందట ఫేస్‌బుక్‌లో ఓ బగ్ కనిపెట్టి.. 7,500 డాలర్లు(రూ.5.5 లక్షలు) గెలుచుకుంది. ఇదిగో ఇప్పుడు మళ్లీ ఇంకోటి. మైక్రోసాఫ్ట్‌లోని అజూర్ క్లౌడ్ సిస్టమ్‌లో బగ్‌ను కనిపెట్టి రూ.22 లక్షల(30 వేల డాలర్లు)ను రివార్డును దక్కించుకుంది.‘‘ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్(ఆర్‌సీఈ) బగ్ ఉంది. ఇది కొత్తది. దీనిపై పెద్దగా ఎవరూ అటెన్షన్ పెట్టలేదు. అయితే.. ఇలాంటి బగ్స్ ద్వారా హ్యాకర్లు ఇంటర్నల్ సిస్టమ్స్ యాక్సెస్ పొందుతారు. సమాచారాన్ని దోచేస్తారు’’ అని ఢిల్లీకి చెందిన అదితి వివరించింది.