ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ. 5000 ఆర్థికసాయం

ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ. 5000 ఆర్థికసాయం

కరోనా వైరస్ మహమ్మారి వల్ల కలిగే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి ఆటోలు, టాక్సీలు, ఇ-రిక్షాలు నడిపే డ్రైవర్లకు 5 వేల రూపాయల ఆర్థికసాయం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోరిక్షాలు, టాక్సీలు, గ్రామీణ సేవా, ఫటా ఫట్ సేవా, మాక్సి క్యాబ్, ఇ-రిక్షాలు మరియు స్కూల్ వ్యాన్లు నడిపే డ్రైవర్లకు ఈ సహాయం అందించబడుతుందని కేజ్రీవాల్ ప్రభుత్వం శనివారం అధికారిక ప్రకటన చేసింది. ఈ లబ్ధిని పొందడానికి డ్రైవర్లు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. పబ్లిక్ సర్వీస్ బ్యాడ్జ్‌లు మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారందరూ దీనిక అప్లై చేసుకోవచ్చని ప్రభత్వం తెలిపింది. ఈ సేవలు సోమవారం ఉదయం నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అప్లికేషన్ ఫాంలో డ్రైవర్ యొక్క బ్యాడ్జ్ నెంబర్, డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ మరియు జెండర్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. గత నెల మార్చి 23 వరకు ఇవ్వబడిన పీఎస్ వీ బ్యాడ్జ్ కార్డుదారులందరూ దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా.. ఫిబ్రవరి 2020లో డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన వారు కూడా ఈ ఆర్థికసాయాన్ని పొందడానికి అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హత కలిగిన డ్రైవర్ల ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలలోకి ఈ 5000 రూపాయల నగదును ట్రాన్స్ ఫర్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. సోమవారం నుండి 15 రోజుల వరకు రవాణా శాఖ వెబ్ సైట్ లో దీనికి సంబంధించిన లింక్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ఇదే విషయంపై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ ప్రభుత్వం.. ఆటోలు, ఇ-రిక్షాలు, టాక్సీలు వంటి ప్రజా రవాణా వాహనాల డ్రైవర్లు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుకూడదని భావించి వారికి సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డబ్బులు నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలోకి జమ అవుతాయి. దీనికి సంబంధించిన దరఖాస్తు చేయడంలో ఏవైనా అనుమానాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి మాట్లొడొచ్చు’ అని ఆయన తెలిపారు.

దరఖాస్తుదారులు ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్‌లైన్ నంబర్లు-011-23930763,011-23970290 లకు ఫోన్ చేసి సహాయాన్ని కోరవచ్చని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల డ్రైవర్ల సంఘాలు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాయి.

For More News..

కరోనా మృతుల్లో అగ్రరాజ్యానికే అగ్రభాగం

24 గంటల్లో 34 మరణాలు, 909 కొత్త కేసులు

మా వాళ్లను ఇబ్బంది పెట్టారో.. ఖబడ్దార్

ఎన్ని కణాలుంటే వైరస్ సోకుతుందో తెలుసా..

లాక్ డౌన్ ఎత్తేయాలంటే ఈ ఆరు ఖచ్చితంగా చేయాలి..