డీజిల్‌పై ట్యాక్స్‌ తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం

డీజిల్‌పై ట్యాక్స్‌ తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం
  • 30 శాతం నుంచి 16.75శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు
  • రూ.8 తగ్గిన డీజిల్‌ ధర

న్యూఢిల్లీ: డీజిల్‌ ధరలపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా పెట్రోల్‌ కంటే డీజిల్‌ రేట్లు అధికంగా ఉండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు డీజిల్‌పై వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించినట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. దీంతో డీజిల్‌ ధర లీటర్‌‌కు రూ.8 తగ్గింది. రూ.82 గా ఉన్న రేటు రూ.73.64కి చేరుతుందని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. “ ఢిల్లీ ఎకానమీని రివ్యూ చేసేందుకు ఇదో మేజర్‌‌ స్టెప్‌ అని కేజ్రీవాల్‌ చెప్పారు. ఢిల్లీలో గత కొద్దిరోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. రికార్డు స్థాయిలో పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరలే ఎక్కువగా ఉంది.