మాస్క్ కంపల్సరీ.. లేకుంటే రూ.500 ఫైన్

మాస్క్ కంపల్సరీ.. లేకుంటే రూ.500 ఫైన్

ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీలో కొవిడ్ 19 బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన సర్కారు మళ్లీ మాస్క్ నిబంధన అమల్లోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ను తప్పనిసరిగా ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధన ఉల్లంఘించిన వారికి రూ.500 ఫైన్ విధించనున్నట్లు ప్రకటించింది. అయితే ప్రైవేటు కార్లలో ప్రయాణించే వారికి మాత్రం మాస్క్ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది. 

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం సమావేశమైన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ.. తప్పనిసరి మాస్క్ నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 2న ఢిల్లీ ప్రభుత్వం ఫేస్ మాస్క్ అవసరంలేదని.. మాస్క్ పెట్టుకోకపోయినా ఎలాంటి ఫైన్ విధించమని ప్రకటించింది. కానీ కేసులు పెరుగుతుండటంతో రోజుల వ్యవధిలోనే మళ్లీ మాస్క్ కంపల్సరీ చేసింది.