ఢిల్లీలో ఈ ఏడాదిలోనే అతి తక్కువ కాలుష్యం

ఢిల్లీలో ఈ ఏడాదిలోనే అతి తక్కువ కాలుష్యం
  •  వారం రోజులుగా ఏక్యూఐ 100 లోపే నమోదు
  • ఆదివారం సాయంత్రం 6 గంటలకు 56 పాయింట్లు

న్యూఢిల్లీ: దేశరాజధానిలో వారం రోజులుగా గాలి నాణ్యత పెరుగుతోంది. వాతావరణం మారడం, వర్షాలు కురుస్తుండడంతో కాలుష్యం తగ్గుతోంది. వారం రోజులు వరుసగా వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 100 పాయింట్ల లోపే నమోదవుతోందని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఏక్యూఐ 56 పాయింట్లుగా నమోదైందని, ఇది ఈ ఏడాదిలోనే మెరుగైన ఏక్యూఐ అని చెప్పారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివరాల ప్రకారం.. జూలై 1 నుంచి 7 వరకు ఏక్యూఐ అతి తక్కువ కేటగిరిలో ఉంది. 

ఆదివారం ఇంకా అత్యల్పంగా నమోదు అయింది. ఏక్యూఐ 50 లోపు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్లని, 51 నుంచి 100 లోపు ఉంటే సంతృప్తికరమని, 101 నుంచి 200 నార్మల్, 201నుంచి 300 లోపు నమోదైతే గాలి నాణ్యత క్షీణిస్తుందని అర్థమన్నారు. 301 నుంచి 400 లోపు నమోదైతే డేంజర్, 401 పాయింట్లు దాటి నమోదైతే ప్రమాదకర స్థాయి దాటినట్లు అని నిపుణులు చెబుతున్నారు.