కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు భారీ షాక్

కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు భారీ షాక్

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐటీ శాఖ సీజ్ చేసిన రూ.105 కోట్లను రిలీజ్ చేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఇటీవల ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాను ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఖాతాను పునరుద్ధరించినా.. అందులోని రూ.105 కోట్ల ట్యాక్స్ పై నోటీసు జారీ చేసింది. దీనిపై స్టే విధించాలని హస్తం పార్టీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ పన్ను పెనాల్టీ కేసులో ITAT ఆర్డర్‌తో జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది.

2018-19 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి రూ.102 కోట్ల బకాయి పన్నును రికవరీ చేయాలని ఐటీ శాఖ కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 8న, ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) నోటీసుపై స్టే కోరుతూ పార్టీ దాఖలు చేసిన దరఖాస్తును కొట్టివేసింది. దీంతో కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. లోక్‌సభ ఎన్నికల ముందు  తమ బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ అయితే పార్టీ కార్యక్రమాలకు చాలా కష్టంగా  మరతాయని, క్రాంగ్రెస్ పార్టీ తరుపున న్యాయవాది వివేక్‌ టంఖా కోర్టును కోరారు.  2021లో పన్ను డిమాండ్‌లో 20 శాతం చెల్లించే వెసులుబాటును కాంగ్రెస్‌కు ఇచ్చామని ఐటీ శాఖ తరపు న్యాయవాది తెలిపారు.