పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం

పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం

ఢిల్లీ హైకోర్టు పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పరిశుభ్రత, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు ప్రత్యేక అధికారిని ఇంఛార్జ్ గా నియమించాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ ఆదేశించించారు.

ఢిల్లీ అంతటా పబ్లిక్ టాయిలెట్లు కంపు కొడుతున్నాయని.. అపరిశుభ్రంగా ఉన్నాయని.. నీరు, విద్యుత్ సమస్యలతో రోజురోజుకు పెరిగిపోతున్నాయని జన్ సేవా సంక్షేమ సంఘం  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీ నగరంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ప్రతి పబ్లిక్ టాయిలెట్ పరిశుభ్రతను పర్యవేక్షించేందుకు ఒక అధికారిని ఇన్ ఛార్జ్ గా నియమించాలని ఎంసీడీ అధికారులను ఆదేశించింది.2024 జనవరి 29కి తదుపరి విచారణను వాయిదా వేసింది. 

పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై ఫిర్యాదు రిపోర్టింగ్ లేదా ఫీడ్ బ్యాకఖ్ సిస్టమ్ ను అమలు చేయాలని హైకోర్టు తెలిపింది. ప్రతి టాయిలెట్ దగ్గర టాయిలెట్ల నిర్వహణ బాధ్యత వహించే సంస్థల పేరు, సంప్రదింపు నంబర్లను రాయించాలని అధికారులను అదేశించింది.