Delhi liquor case : బుచ్చిబాబుకు14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Delhi liquor case : బుచ్చిబాబుకు14  రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన  ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ బుచ్చి బాబుకు సీబీఐ స్పెషల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఫిబ్రవరి 8న అరెస్టయిన గోరంట్ల బుచ్చిబాబు మూడు రోజుల సీబీఐ కస్టడీ నేటీతో ముగిసింది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబును సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఆయనతో పాటు మాగుంట రాఘవ రెడ్డిని కూడా ఈడీ అధికారులు సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ క్రమంలో లిక్కర్ పాలసీ కుట్రలో బుచ్చి బాబు భాగస్వామిగా ఉన్నారని.., నిందితులతో కలిసి అనేక మీటింగ్ లలో ఆయన పాల్గొన్నారని సీబీఐ అధికారులు ఆరోపించారు. బుచ్చిబాబు తీవ్రమైన నేరానికి పాల్పడ్డారని కోర్టు వారికి వివరించారు. జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరారు. దీంతో సీబీఐ అధికారులతో ఏకీభవించిన స్పెషల్ కోర్టు.. ఆడిటర్ బుచ్చిబాబుకు 14 రోజుల జుడిషియల్ కస్టడీని విధించింది. దీంతో ఆయన ఈ నెల 25వరకు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండనున్నారు.