ఢిల్లీ మేయర్ ఫేస్ బుక్ ఖాతానే హ్యాక్ చేశారు.. ఇక మామూలు జనం సంగతేంటీ..

ఢిల్లీ మేయర్ ఫేస్ బుక్ ఖాతానే హ్యాక్ చేశారు.. ఇక మామూలు జనం సంగతేంటీ..

ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ డిసెంబర్ 15న తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజీని యాక్సెస్ చేయలేకపోతున్నానని పేర్కొన్నారు. కొన్ని రోజుల నుండి తాను తన ఫేస్‌బుక్ పేజీని యాక్సెస్ చేయలేకపోతున్నానని, అది హ్యాక్ అయిందని అందరికీ తెలియజేస్తున్నానన్నారు. తాము వీలైనంత త్వరగా దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తన పేజీ ద్వారా ఎవరికైనా.. ఏదైనా మెసేజ్ లు, పోస్టులు వస్తే వెంటనే విస్మరించండి, స్పందించకండి అని కోరారు.

నాలుగైదు రోజుల క్రితం మేయర్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని, ఆమె దాని యాక్సెస్‌ను కోల్పోయిందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారి ఒకరు తెలిపారు. ఒక బృందం ఖాతాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోందని, అయితే అది ఇంకా విజయవంతం కాలేదన్నారు. ఖాతా నుండి ఎటువంటి అనవసరమైన సందేశం లేదా కార్యాచరణ ఇప్పటివరకు నివేదించబడలేదు. ఖాతా పునరుద్ధరణ సాధ్యం కాకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.

మేయర్ ఫేస్‌బుక్ ఖాతా ఆరు నుంచి ఏడు నెలల ముందు కూడా హ్యాక్ అయింది. అప్పట్లో అది వెంటనే రికవరీ చేయబడిందని అధికారి తెలిపారు.