
రెండు జట్లు ఒకచోటు ఉన్నా కలుస్తాయేమో కానీ..రెండు కొప్పులు మాత్రం ఒకే చోట ఉన్నా కలవయంటారు పెద్దలు. అయితే ఇదే సామెతను నిజం చేస్తూ ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకున్నారు. పబ్లిక్ గా..జుట్టు పట్టుకుని మరీ పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జట్టు పట్టి..కొట్టి..
ఢిల్లీ మెట్రో రైల్లో ఇద్దర ఆడవాళ్లు గొడవ పడ్డారు. ఒకరినొకరు నెట్టేసుకున్నారు. పరస్పరం గట్టిగా తోసుకున్నారు. బండబూతులు తిట్టుకున్నారు. జుట్టుపట్టుకుని కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు వద్దని వారించినా..అడ్డుకున్నా వినలేదు.
Kalesh b/w Two Woman inside Delhi metro over not giving place to stand pic.twitter.com/8a11cfg1Hz
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 15, 2023
గొడవ ఎందుకంటే..
ఢిల్లీ మెట్రో రైల్లో ఇద్దరు మహిళలు ఎక్కారు. అప్పటికే మెట్రో రైలు ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. నిలబడేందుకు కూడా స్థలం లేని పరిస్థితి. ఈ సమయంలో ఓ మహిళ కొద్దిగా జరుగూ నిలబడతా అని అడిగింది. మరో మహిళ నేను నిలబడటానికే స్థలం లేదు..నీకెక్కడ ఇవ్వాలని గట్టిగా అన్నది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం పెరిగిపోయి పరస్పరం నెట్టుకున్నారు. మహిళలు గొడవ పడుతుండగా అదే మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి పోస్ట్ చేశాడు. దీంతో వైరల్ అయింది. ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ చేశారు.