ఈడీ కస్టడీ నుంచే.. మొహల్లా క్లీనిక్లపై కేజ్రీవాల్ ఆదేశం

ఈడీ కస్టడీ నుంచే.. మొహల్లా క్లీనిక్లపై కేజ్రీవాల్ ఆదేశం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే మంత్రులకు,అధికారులకు  పరిపాలన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటీవల తాగునీటి కోసం మంత్రి అతిశీకి కేజ్రీవాల్  ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఢిల్లీలోని మోహల్లా క్లీనిక్ లపై కేజ్రీవాల్ ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.

ఈడీ కస్టడీ నుంచి కూడా ఢిల్లీ సీఎం రాష్ట్ర  ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. తాను జైలుకెళ్లినందుకు   ఢిల్లీ ప్రజలు బాధపడకూడదు . మొహల్లా దవాఖాన్లలో  నిర్వహించే  టెస్టుల కోసం  ప్రజలు ఇబ్బందులు పడకూడదు. దీని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ..  కేజ్రీవాల్ ఇవాళ జైలు నుంచి  ఆదేశించారని మంత్రి సౌరబ్  భరద్వాజ్ తెలిపారు.

ALSO READ :- బెల్ట్ షాప్లపై పోలీసుల దాడులు.. 9 లక్షల 43వేల విలువైన మద్యం సీజ్

మరో వైపు ఆప్ నేతలు ఇవాళ ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు .దీంతో  మోదీ నివాసం దగ్గర 144 సెక్షన్ విధించడంతో పాటు భారీ భద్రతను ఏర్పాుటు చేశారు.