బెల్ట్ షాప్లపై పోలీసుల దాడులు.. 9 లక్షల 43వేల విలువైన మద్యం సీజ్

బెల్ట్ షాప్లపై పోలీసుల దాడులు.. 9 లక్షల 43వేల విలువైన మద్యం సీజ్

సైబరాబాద్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న  బెల్ట్ షాపులపై ఎస్వోటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిన్న రాత్రి(2024 మార్చి 25) SOT టీమ్స్ దాడులు చేసింది. ఇందులో భాగంగా 29 బెల్ట్ షాప్ ల్లో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 9 లక్షల 43వేల 8వందల- విలువ గల 859 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ :- నాయకులకు చుక్కలు చూపిస్తున్న ఈసీ..!

అన్నింటికంటే అత్యధికంగా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 బెల్ట్ షాప్స్ నుంచి ఒక లక్ష 54వేల విలువగల 241 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకోవడం జరిగిందని వెల్లడించారు. నిందుతులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడితే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.