నాయకులకు చుక్కలు చూపిస్తున్న ఈసీ..!

నాయకులకు చుక్కలు చూపిస్తున్న ఈసీ..!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో పొలిటికల్ హీట్ రోజురోజకి రెట్టింపవుతుంది.ఈ నేపథ్యంలో ఈసీ ఈసారి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ ను చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్న ఈసీ, ఎన్నికల ప్రచారం విషయంలో రూల్స్ ని మరింత కఠినతరం చేసింది. ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయటానికి కూడా పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపింది. అంతే కాకుండా పాంప్లెట్స్ పంచటానికి కూడా ఎన్నికల సంఘం అధికారుల నుండి అనుమతి తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ALSO READ :- ఢిల్లీలో హై టెన్షన్.. ప్రధాని మోదీ నివాసం చుట్టూ 144 సెక్షన్..

ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరించే వ్యక్తులు, ముఖ్య నేతలు తమ ప్రచార వాహనాలకు పర్మిషన్స్  సీఈవో స్దాయిలోనే తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. అలాగే రాజకీయ పార్టీలు తమ ప్రచార సామాగ్రికి అనుమతులు కూడా ఎన్నికల ప్రధానాధికారి వద్దనే తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తుంటే స్ధానిక జిల్లా రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరి అని ఈసీ తెలిపింది. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించాలంటే 48 గంటల ముందే అనుమతి తీసుకోవాలని, ఎలక్షన్ జరగటానికి 48 గంటల ముందు నుండి ప్రచారానికి ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ తెలిపారు.