
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఢిల్లీ, ముంబైలో హోలీ వేడుకలపై నిషేదం విధించాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఢిల్లీలో మంగళవారం ఒక్కరోజే రికార్డు స్ధాయిలో 1101 కొత్త కేసులు నమోదు కాగా.. నాలుగురు చనిపోయారు.సాధారణంగా అయినా సరే ఎక్కువ మంది ప్రజలు కలవడంపై బ్యాన్ విధించింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చే ప్రజలకు కూడా రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో , బస్ టర్మినల్స్‌లో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.