
ఢిల్లీలోని బవానా పారిశ్రామికవాడలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం కారణంగా సంభవించిన భారీ పేలుడు ధాటికి ఓ భవనం కుప్పకూలింది. శనివారం ( మే 24 ) తెల్లవారుజామున చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. బవానా పారిశ్రామికవాడలోని సెక్టార్ 2 లో ఉన్న ప్లాస్టిక్ బాటిళ్ల తయారీ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున 4:48 గంటలకు అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందటంతో 17 అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఈ అగ్నిప్రమాదం కారణంగా సంభవించిన భారీ పేలుడు ధాటికి ఓ భవనం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో భారీ ఎత్తున మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ క్రమంలో దట్టమైన పొగ అలుముకుంది. అయితే.. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ పేలుడు సంభవించడంతో సమీప ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మరిన్ని పేలుళ్లు సంబవిస్తాయేమోనన్న భయంతో జనం ఇళ్ల నుండి బయటికి పరుగులు తీశారు.
VIDEO | Delhi: Fire broke out in a factory in Bawana Industrial Area earlier today. Fire brigade at the spot trying to control the blaze.#DelhiNews
— Press Trust of India (@PTI_News) May 24, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/pVVJQNegzL
శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో రక్షణ చర్యలు చేపట్టేందుకు కష్టతరంగా మారిందని అధికారులు తెలిపారు. మంటలు చెలరేగడానికి, ఆ తర్వాత పేలుడుకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బిల్డింగ్ సేఫ్టీ మెజర్స్ కి అనుగుణంగా ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు.