కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మూడు రోజులు హలిడే

కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మూడు రోజులు హలిడే

G20  సమ్మిట్ సందర్భంగా ఢిల్లీలో సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు పబ్లిక్ హాలిడే  ప్రకటించారు  సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ తేదీల్లో అన్ని పాఠశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు,  షాపులు  మూసివేయబడతాయి.   సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలంటూ  ఢిల్లీ పోలీస్ శాఖ    సీఎస్ ను కోరింది. ఈ మేరకు  కేజ్రీవాల్ ఒకే చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, చైనా ప్రధాని జీ జిన్‌పింగ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సహా పలువురు దేశాధినేతలు, దౌత్యవేత్తలు  సమ్మిట్ కు రానున్నారు. ఈ  సందర్భంగా వాహనాల రాకపోకలు, శాంతిభద్రతలు సజావుగా ఉండేలా ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

రెండు రోజులు G20 సమ్మిట్

సెప్టెంబరు 9- 10 తేదీల్లో రెండు రోజుల పాటు  జీ20 సదస్సు జరగనుంది. ప్రగతి మైదాన్‌లో కొత్తగా ఓపెన్ చేసిన కన్వెన్షన్ సెంటర్‌లో సమ్మిట్ జరగనుంది. అయితే, షెర్పా సమావేశాలు , ఫైనాన్స్, ఎనర్జీ , సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశాలతో సహా సంబంధిత ఈవెంట్‌లు సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతాయి.ఈ  ఈవెంట్  గెస్టుల బస కోసం నగరం అంతటా  దాదాపు 23 హోటళ్ళు  బుక్ చేశారు.