V6 News

ఢిల్లీ ఆర్డినెన్స్​వెనక్కి తీసుకోవాలె

ఢిల్లీ ఆర్డినెన్స్​వెనక్కి తీసుకోవాలె
  • ప్లానింగ్ ​బోర్డు వైస్​ చైర్మన్​ వినోద్


హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కోత పెడుతూ కేంద్రం పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్​ వెనక్కి తీసుకోవాలని ప్లానింగ్​ బోర్డు వైస్​ చైర్మన్ ​వినోద్​కుమార్​ ఒక ప్రకటనలో కోరారు. కేంద్రం ప్రతిపాదించిన నేషనల్ ​క్యాపిటల్​ ఏరియా ఢిల్లీ గవర్నమెంట్​(అమెండ్​మెంట్)–2023 బిల్లు రాష్ట్రాల హక్కులను హరించేదన్నారు. ఈ బిల్లు ఢిల్లీలోని నేషనల్​ క్యాపిటల్ ​టెరిటరీ(ఎన్సీడీటీ)లో ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని బలహీనపరుస్తుందన్నారు. ఢిల్లీలో అధికారుల బదిలీలు, పోస్టింగ్​లపై లెఫ్టినెంట్​గవర్నర్​కు అధికారాలు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. దీనికి ఆమోదముద్ర పడితే ప్రజాస్వామ్యం బలహీన పడుతుం దన్నారు. ఇది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమన్నారు.