తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కన్నెపల్లిలో పదేళ్ల కింద మూతబడిన ప్రభుత్వ పాఠశాల మళ్లీ ప్రారంభమైంది. శనివారం ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి ఎంఈవో గడ్డి శ్రీనివాస్, సర్పంచ్ శైలజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో సర్కారు బడులు మూతపడ్డాయన్నారు.
ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి అన్ని సౌకర్యాలు కల్పించి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. పాఠశాలకు అవసరమై సౌకర్యాలను సొంత ఖర్చులతో సమకూరుస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల పునః ప్రారంభం రోజే పది మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంజిత్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ విద్యాసాగర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
