ములుగు, వెలుగు : ములుగు మండలం ఇంచర్ల ఎంఆర్ గార్డెన్స్ లో ఈనెల 17న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. 70కి పైగా కంపెనీలలో వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని, నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు.
ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతుందని, ఇంజినీరింగ్, టెక్నికల్, ఫార్మసీ, స్కిల్డ్ వర్క్, సర్వీసెస్, తదితర రంగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం నియామకాలు చేపట్టనున్నామన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క ఈ మెగా జాబ్ మేళాను ప్రారంభించనున్నారని, వివరాలకు 87126 70103, 87126 70111ను సంప్రదించాలని తెలిపారు.
