30 వేల టియర్ గ్యాస్ షెల్స్ రెడీ.. ఢిల్లీ ఎలా వస్తారో చూస్తామంటున్న పోలీసులు

30 వేల టియర్ గ్యాస్ షెల్స్ రెడీ.. ఢిల్లీ ఎలా వస్తారో చూస్తామంటున్న పోలీసులు

పంటలకు గిట్టుబాటు ధరలు, రైతు చట్టం సవరణలకు డిమాండ్ చేస్తూ.. పంజాబ్, రాజస్తాన్, హర్యానా, యూపీ రైతులు ఢిల్లీ ముట్టడికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతులను ఎక్కడికక్కడ ఆపటానికి భారీ ఎత్తున పోలీస్ బలగాలు రంగంలోకి దించింది మోదీ ప్రభుత్వం. రైతులు ఢిల్లీలో అడుగు పెట్టకుండా ఢిల్లీ సరిహద్దులను మూసివేసింది. ఇదే సమయంలో భారీ ఎత్తున ఆయుధాలను రెడీ చేసుకుంది.

రైతులు ఢిల్లీ వైపు వస్తే వాళ్లను చెల్లాచెదురు చేయటానికి ఏకంగా 30 వేల టియర్ గ్యాస్ షెల్స్ సిద్ధం చేసుకున్నారు పోలీస్ బలగాలు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వీటిని తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర గ్వాలియర్ నుంచి ఇప్పటికే ఇవి ఢిల్లీ పోలీసుల చేతుల్లోకి చేరాయి. ఈ 30 వేల టియర్ గ్యాస్ షెల్స్ ను ఢిల్లీ చుట్టూ రక్షణగా ఉన్న పోలీస్ బలగాలకు చేరాయి. 

టియర్ గ్యాస్ ప్రయోగించటం ద్వారా గుంపులను చెదరగొట్టటంతోపాటు కళ్ల మంట, చికాకు ద్వారా రైతులు ముందుకు రాకుండా అడ్డుకుంటుంది. టియర్ గ్యాస్ ప్రయోగం అనే వ్యూహంతో రైతులను అడ్డుకోవటానికి ముఖ్యమైన ఆయుధంగా భావిస్తున్నారు పోలీసులు. రబ్బర్ బుల్లెట్ల కంటే టియర్ గ్యాస్ ప్రయోగం ద్వారా.. రైతులు ఢిల్లీలో అడుగు పెట్టకుండా చూడాలనేది పోలీసుల యాక్షన్ ప్లాన్. మరి ఈ వ్యూహాన్ని రైతులు ఎలా చేధించుకుని వస్తారో చూడాలి...

 

Also Read: అమితాబ్ బచ్చన్ దంపతుల ఆస్తులు ఎంతో తెలుసా..?