New Year: 18 వేల మంది పోలీసుల గస్తీ

New Year: 18 వేల మంది పోలీసుల గస్తీ

న్యూ ఇయర్ సందర్భంగా ఢిల్లీలో ఎటూ చూసినా జోష్ కనిపిస్తోంది. ముఖ్యంగా మార్కెట్లు, టూరిస్ట్ ప్లేసులు, షాపింగ్ మాల్స్లో సందడి నెలకొంది. ఇండియా గేట్ దగ్గర సెలబ్రేషన్స్ చేసుకునేందుకు టూరిస్టులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ఇండియా గేటు దగ్గర సందడి కనిపిస్తోంది.కర్తవ్యపథ్ రోడ్డు మొత్తం టూరిస్టులతో నిండిపోయింది.

ట్రాఫిక్ నింబధనలు

న్యూ ఇయర్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 8 నుంచి అందరూ రూల్స్ పాటించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. న్యూఇయర్ వేడుకలతో ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 18 వేల మంది పోలీసులు గస్తీ కాస్తున్నారు.125 డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా మహిళల భద్రత కోసం మహిళ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీలో 2,500 మందికి పైగా మహిళా సిబ్బందిని నియమించామని పోలీసులు చెప్పారు.

కట్టుదిట్టమైన భదత్రాఏర్పాట్లు 

ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా కట్టుదిట్టమైన భదత్రాఏర్పాట్లు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. గతేడాది నూతన సంవత్సరం సందర్భంగా మొత్తం 657 చలాన్‌లు జారీ చేయగా, అందులో 36 మంది మద్యం తాగి వాహనాలు నడిపినందుకు సంబంధించినవేనని పోలీసులు తెలిపారు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి కన్నాట్‌ ప్లేస్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు చెప్పారు. 

రూల్స్ పాటించాల్సిందే

మరోవైపు కార్ల అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ ఉంటే చట్ట ప్రకారం సదరు వ్యక్తులపై చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని స్పష్టం చేశారు. కోవిడ్-19కి సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా అందరూ పాటించాలని కోరారు. మద్యం తాగి వాహనాలు నడపడం, బైక్ పై స్టంట్స్ వేయడం, అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇండియా గేట్ వద్ద పార్కింగ్ స్థలం కొరత ఉన్నందున సందర్శకులు తమ సొంత వాహనాల్లో రాకుండా ప్రజా రవాణాను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.